Site icon NTV Telugu

Smriti Mandhana: సరికొత్తగా గుడ్ న్యూస్ చెప్పిన వరల్డ్ కప్ విన్నర్.. వీడియో వైరల్..!

Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్, వరల్డ్ కప్ విజేత స్మృతి మంధాన (Smriti Mandhana) తన అభిమానులకు తీపి కబురు తెలిపింది. తన చిరకాల మిత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) తన నిశ్చితార్థం (Engagement) జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని ఆమె చాలా సరదాగా, వినూత్నంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా పంచుకోవడం విశేషం.

Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి నుంచే తొలి టెస్టు!

‘సమ్జో హో హీ గయా’.. అంటూ స్మృతి తన సహచర క్రీడాకారిణులు జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డిలతో కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు. “లగే రహో మున్నాభాయ్” సినిమాలోని క్లాసిక్ హిట్ సాంగ్ “సమ్జో హో హీ గయా” పాటకు వీరంతా కలిసి డ్యాన్స్ చేశారు. వీడియో చివర్లో స్మృతి మంధాన కెమెరా వైపు తన చేతికున్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను (Ring) చూపించింది. దీంతో ఎప్పటి నుంచో వీరి ప్రేమాయణంపై వస్తున్న వార్తలను ఆమె కన్ఫామ్ చేసింది. గత అక్టోబర్‌లో ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనే పలాష్ ముచ్చల్.. స్మృతి త్వరలోనే “ఇండోర్ కోడలు” కాబోతోందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్ విన్నర్.. రికార్డుల రారాణి.. మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోను స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల భారత్ సాధించిన చారిత్రాత్మక ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో స్మృతి మొత్తం 9 ఇన్నింగ్స్‌లలో 54.22 సగటుతో ఏకంగా 434 పరుగులు సాధించారు. ఇందులో న్యూజిలాండ్‌పై చేసిన అద్భుత శతకం కూడా ఉంది.

Venky 77 : వెంకీ – త్రివిక్రమ్ రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్

ఈ నేపథ్యంలో ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా స్మృతి చరిత్ర సృష్టించారు. 2017లో మిథాలీ రాజ్ నెలకొల్పిన 409 పరుగుల రికార్డును ఆమె అధిగమించారు. ఫైనల్‌లోనూ దక్షిణాఫ్రికాపై షెఫాలీ వర్మతో కలిసి స్మృతి శుభారంభాన్ని అందించారు. మొత్తానికి అటు వరల్డ్ కప్ విజయం, ఇటు నిశ్చితార్థంతో స్మృతి మంధాన తన జీవితంలో అత్యంత ఆనందకరమైన దశను ఆస్వాదిస్తున్నారు.

Exit mobile version