Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్.. పెళ్లి చేసుకోబోతున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana and Palash Muchhal Reunite: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. ఆ వీడియోలో పలాష్ ముచ్చల్ సోదరి పలక్ ముచ్చల్, ఆమె భర్త మిథున్‌తో కలిసి స్మృతి మంధాన తండ్రితో కనిపించడం గమనార్హం. ముంబైలోని ఒక రెస్టారెంట్ బయట ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియోలో పలక్.. స్మృతి తండ్రికి నమస్కారం చేయగా, ఆయన ఆమెను ఆశీర్వదించడం కనిపిస్తుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు సవ్యంగానే ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
గతంలో 2025 నవంబర్‌లో స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే, పెళ్లికి ముందు రోజు రాత్రే ఈ సంబంధం విరిగిపోయింది. పలాష్ ముచ్చల్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వివాహం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను పలాష్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోతో ఇద్దరూ మళ్లీ కలవబోతున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కొందరు అభిమానులు ఈ జంట మళ్లీ ఒక్కటవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఈ వీడియో పాతదా లేక తాజాదా అన్నది అధికారికంగా ధృవీకరించబడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇది సంచలనం సృష్టిస్తోంది. స్మృతి మంధాన ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత ఆసక్తిని పెంచుతోంది.
*
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!