NTV Telugu Site icon

Krishna Express: కృష్ణా ఎక్స్ప్రెస్లో పొగలు.. ప్రయాణికులు సేఫ్

Krishna Express

Krishna Express

ఈ మధ్యకాలంలో రైళ్లలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటన, తెలంగాణలో రైలు పట్టాలు తప్పడం, బోగీల్లో మంటలు చెలరేగడం.. ఇలాంటి ప్రమాదాలు తరుచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి, ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలులోని ఏసీ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది. రైలు సికింద్రాబాద్ వెళుతుండగా ఏపీలోని వెంకటగిరి స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరమ్మతులు పూర్తిచేశాక తిరిగి రైలు అక్కడినుంచి బయలుదేరింది.

Read Also: Crime News: విమానంలో పరిచయం.. హోటల్‌లో మహిళపై అత్యాచారం!

శుక్రవారం తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరిన కృష్ణా ఎక్స్ ప్రెస్.. వెంకటగిరి స్టేషన్ సమీపంలో ఏసీ బోగీలో పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దీంతో వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది.. బోగీ వద్దకు చేరుకుని పొగలు ఎక్కడి నుంచి వస్తుందని పరిశీలించారు. అయితే ఏసీ కోచ్ బోగీ బ్రేకులు పట్టేయడం వల్లే పొగలు వచ్చాయని సిబ్బంది గుర్తించారు. వెంటనే మరమ్మత్తులు చేసిన రైల్వే సిబ్బంది.. ఆ తర్వాత అక్కడినుంచి రైలు బయల్దేరింది. దాదాపు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. మరోవైపు ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.