Site icon NTV Telugu

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..! అరగంట నిలిచిన రైలు

Vande Bharath

Vande Bharath

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెడుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం పొగలు వచ్చాయి. తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్తోన్న వందే భారత్ రైలులో పొగలు రావడంతో అధికారులు అరగంట పాటు నిలిపివేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే పొగలు వచ్చాయి. వాటిని గుర్తించిన రైల్వే సిబ్బంది మనుబోలు రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలును నిలిపివేశారు. అనంతరం అందులో ప్రయాణికులందర్నీ బోగీ నుండి కిందకు దింపారు. దీంతో ప్రాణపాయం తప్పింది.

Schengen Visa: సూపర్‌ ఫాస్ట్ గా జర్మనీ షెంజెన్‌ వీసా ప్రక్రియ.. సిబ్బందిని పెంచిన రాయబార కార్యాలయం

వందేభారత్ రైలులోని మూడో బోగీలో పొగలను గుర్తించారు. బాత్రూమ్ నుండి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి తనిఖీ చేపట్టారు. అయితే సిగరేట్ కాల్చిపడేసిన ముక్క కనపడింది. అది ప్లాస్టిక్ సామాగ్రికి వ్యాపించడంతో పొగ వచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు. అనంతరం రైలులో పొగలను పూర్తిగా ఆపివేసి, రైలును పంపించారు.

Exit mobile version