NTV Telugu Site icon

Chennai-Delhi Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..తప్పిన ప్రమాదం

Rajdhani Express

Rajdhani Express

Chennai-Delhi Rajdhani Express: నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌లో చెన్నై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైల్లో ఉన్నట్లుండి పొగలు రావడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. చెన్నై నుంచి ఢిల్లీ హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బీ-5 బోగీలో నుంచి పొగలు రావటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే రైలును కావలి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు.

Read Also: GT vs KKR: చివరలో దుమ్మురేపిన రింకూ సింగ్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాదే గెలుపు

పొగలు రావడంతో రైల్వేస్టేషన్‌ సమీపంలో సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. ఈ ఘటనపై విచారణ జరిపిన రైల్వే అధికారులు.. బ్రేక్ జామ్ కారణంగానే పొగలు వెలువడ్డాయని తెలిపారు. రైలు మరమ్మతులు చేసిన తర్వాత మళ్లీ ప్రయాణం ప్రారంభించామన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరూ కూడా గాయపడలేదు.

Read Also:SRH vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

గతంలో కూడా బ్రేక్ లాక్ జామ్ కారణంగా రైళ్లలో పొగలు వచ్చాయి. అంతకుముందు పూణే నుంచి జమ్మూ తావి మధ్య నడుస్తున్న జీలం ఎక్స్‌ప్రెస్ రైలు లో పొగలు వెలువడ్డాయి. దీంతో ప్రయాణికులు చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. దీంతో పాటు అజ్మీర్ నుంచి బ్రాంద్రా వెళ్తున్న అజ్మీర్-బాంద్రా రైలు లో కూడా బ్రేక్ లాక్ జామ్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. అయితే.. రైల్వే ఉద్యోగులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చి అదుపులోకి తెచ్చారు.

Show comments