GT vs KKR: చివరలో దుమ్మురేపిన రింకూ సింగ్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాదే గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs KKR: ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించింది. రింకూ సింగ్(48) ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగించడంతో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 29 రన్స్ కావాలి. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్ రెండో బంతికి రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, కోల్‌కతా ఆటగాళ్లు పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చారు. వరుస రెండు విజయాలతో ఊపు మీదున్న గుజరాత్‌కు ఇది తొలి ఓటమి కావడం గమనార్హం.

యష్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూ సింగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక్కడి నుంచే రింకూ సింగ్ విధ్వంసం మొదలైంది. చివరి ఐదు బంతులను ఐదు సిక్సర్లుగా మలిచి కేకేఆర్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రింకూ సింగ్ 21 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 80 పరుగులు చేసి కేకేఆర్ విజయానికి బాటలు వేశాడు. అయితే ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నమోదు చేసి మ్యాచ్‌ను గుజరాత్ వైపు టర్న్ చేశాడు. అయితే యశ్ దయాల్ ఆఖరి ఓవర్లో చెత్తగా బౌలింగ్ చేసి మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడు.
Also Read
- ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
- 12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
- 10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
- Cyclone Akwan Alert: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
ఐపీఎల్లో తొలి హ్యాట్రిక్ నమోదు
ఐపీఎల్ 16వ సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. కాగా ఐపీఎల్లో రషీద్ ఖాన్‌కు ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ తరపున కూడా ఇదే తొలి హ్యాట్రిక్ కావడం మరో విశేషం. ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతికి రసెల్‌ను, రెండో బంతికి సునీల్ నరైన్‌ను, మూడో బంతికి శార్దూల్ ఠాకూర్‌ను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రషీద్ ఖాన్‌కు టి20 కెరీర్లో ఇది నాలుగో హ్యాట్రిక్ కావడం విశేషం. ఇక ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన 19వ బౌలర్‌గా రషీద్ నిలిచాడు. ఇక అత్యధికంగా ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు. అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేయగా.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ రెండుసార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు.
తాజావార్తలు
-
Yamaha Xenter E: 108KM రేంజ్‌తో యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 7.5kW మోటార్, ఫీచర్లు ఇవే!
-
ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!