Buy Fire-Boltt Wonder Smart Watch Just Rs 1299 in Flipkart Big Saving Days Sale 2023: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 నడుస్తోంది. ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్.. ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్‌వాచెస్ లాంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనే కాకుండా.. గృహోపకరణాలపై కూడా భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్‌వాచ్‌లపై కళ్లు చెదిరే తగ్గింపు ఆఫర్స్ ఉన్నాయి. ఎంతలా అంటే.. రూ. 12 వేల స్మార్ట్‌వాచ్ కేవలం రూ. 1,299లకే మీ సొంతం అవుతుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఫైర్ బోల్ట్ వండర్ 1.8 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ (Fire-Boltt Wonder 1.8 Bluetooth Calling Smart Watch) ధర రూ. 11,999గా ఉంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023లో భాగంగా ఈ స్మార్ట్‌వాచ్‌పై ఏకంగా 89 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఫైర్ బోల్ట్ వండర్ స్మార్ట్‌వాచ్ కేవలం రూ. 1,299కి మీ సొంతం అవుతుంది. అంటే మీరు రూ. 10,700 ఆదా చేసుకోవచ్చు. ఎలాంటి బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లేకుండానే ఇంత తక్కువ ధరకు మంచి స్మార్ట్‌వాచ్ మీ సొంతం అవుతుంది.
ఫైర్ బోల్ట్ వండర్ 1.8 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లో 1.8 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. టచ్ స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఇందులో ఉంది. మైక్, స్పీకర్ సైతం ఈ స్మార్ట్ స్మార్ట్‌వాచ్‌లో ఇచ్చారు. మీరు హెల్త్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ బ్యాటరీ రన్ టైం ఐదు రోజులు అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఇంత తక్కువ ధరకు ఇంకా ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఆఫర్ క్లోజ్ అవుతుంది.