NTV Telugu Site icon

New Compact SUV: మీ బడ్జెట్‌లో SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఇవి చూడండి

Cars

Cars

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లు SUV సెగ్మెంట్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. 2024 సంవత్సరం ఫస్టాప్‌లో కార్ల విక్రయాలలో SUV అధికంగా విక్రయించింది. కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, ఎక్సెటర్ వంటి SUVలు ఉన్నాయి. మీరు కూడా కొత్త కాంపాక్ట్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇది తెలుసుకోండి. 2025 సంవత్సరంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు 3 కొత్త కాంపాక్ట్ SUVలను భారత మార్కెట్లో విడుదల చేయబోతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏంటీ..? ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

PM Modi: మంగళవారం ప్రధాని మోడీ బర్త్ డే.. భారీ కార్యక్రమాలకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు

కియా సిరోస్:
ఇండియాలో కియా తన కొత్త కాంపాక్ట్ SUVని 2025 సంవత్సరంలో విడుదల చేయబోతోంది. కియా సిరోస్.. ఇది రోడ్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఇక ఫీచర్లు విషయానికొస్తే, కియా సెరోస్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. పనోరమిక్ సన్‌రూఫ్‌ కూడా ఉంది. ఈ కారు పవర్‌ట్రెయిన్ గురించి ఎటువంటి సమాచారం తెలియదు.

స్కోడా కైలాక్:
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా.. ఈ ఏడాది అక్టోబర్‌లో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రారంభించబోతోంది. స్కోడా కైలాక్.. ఇది వచ్చే ఏడాది జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. స్కోడా SUV 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుందని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 178Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

న్యూ హ్యుందాయ్ వెన్యూ:
హ్యుందాయ్ వెన్యూ 2019లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. తాజాగా.. న్యూ హ్యుందాయ్ వెన్యూని వచ్చే ఏడాది చివరి నాటికి అంటే 2025 నాటికి మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.