ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించారు. దీనితో ముందు నుంచే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..హై ఓల్టేజ్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో బోయపాటి మార్క్ తో స్కంద తెరకెక్కింది. స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ దాదాపుగా రూ. 50 కోట్ల బడ్జెట్‍తో నిర్మించారు. రెండు గంటల 47 నిమిషాల నిడివి తో స్కంద సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 28 న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.స్కంద చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేశారు. అయితే, స్కంద సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా స్కంద సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా డిలీటెడ్ సన్నివేశాలతో పాటు డైలాగ్స్ కూడా యాడ్ చేసి మరి ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు.
స్కంద సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో చూడలేని సీన్లు, వినని డైలాగ్‌లను ఓటీటీలో చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు..కాగా స్కంద సినిమాను డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే స్కంద సినిమాలో రామ్ పోతినేని సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అలాగే మేజర్ బ్యూటి సాయి మంజ్రేకర్ కూడా మరో హీరోయిన్ గా నటించారు. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతెలా ఐటమ్ సాంగ్‌తో అలరించింది. ఈ సినిమా లో ప్రిన్స్ సిసిల్, శ్రీకాంత్, ఇంద్రజ మరియు శరత్ లోహితాశ్వ ముఖ్య పాత్రలు పోషించారు.థియేటర్స్ లో అంతగా మెప్పించలేకపోయిన స్కంద సినిమా ఓటీటీ ప్రేక్షకులను అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి…