NTV Telugu Site icon

Tamilnadu: యువకుడిపై లైంగికదాడి.. వీడియో తీసి బెదిరించి..

Tamilnadu

Tamilnadu

Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై కొందరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బస్సులో వెళుతున్న యువకుడిని కిందికి లాగి లైంగికదాడి చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణప్పారైకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి పుత్తానందం నుంచి మణప్పారైకు బస్సులో ప్రయాణిస్తున్నాడు. వండిపేట్టైకు చెందిన అరివళగన్‌ కూడా అందులో ఉన్నాడు. అకస్మాత్తుగా అరివళగన్‌ తన స్నేహితులకు ఫోన్‌ చేసి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ తనతో గొడవ పడ్డాడని తెలిపాడు. మణప్పారై వద్ద ఉన్న కొలను వద్దకు రావాలని స్నేహితులకు సూచించాడు.

Read Also : Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్

ఫ్రెండ్ మాటలు విని ఐదుగురు వచ్చాక ఆ ఉద్యోగిని బస్సు నుంచి బలవంతంగా కిందికి దింపారు. సమీపంలోని కొలను వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సేతురత్నపురానికి చెందిన రియాజ్‌ ఆయనపై లైంగికదాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి రూ.75 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చేసేదేమీ లేక బాధితుడు నగదు వారికి పంపించాడు. తరవాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముహమ్మద్‌ రియాజ్‌, అరివళగన్‌, అరుణ్‌కుమార్‌, లియోబ్లాయిడ్‌, సెంథిల్‌కుమార్‌ తదితర ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో రియాజ్‌, సెంథిల్‌కుమార్‌లు గతంలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Read Also : Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోతలో 67 మంది నిర్దోషులే అని ప్రకటించిన కోర్టు.. అసదుద్దీన్ మండిపాటు

Show comments