NTV Telugu Site icon

Road Accident: ఏపీలో రోడ్డు టెర్రర్‌.. ప్రమాదంలో ఆరుగురు మృతి

Accident

Accident

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అర్థరాత్రి పలు రోడ్డు ప్రమాదాలతో దాదాపు ఆరుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారిపై నేటి (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వెహికిల్ ను వెనుక నుంచి టాటా ఏస్ వాహనం స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించాగా.. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. టాటా ఏస్ వాహనంలో డెకరేషన్ చేసే పని వాళ్ళు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని జీజీహెచ్‌కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ నుండి రిలీజ్ కానున్న మరో ట్రైలర్..?

ఇక, శ్రీకాళహస్తి మండల వాంపల్లి దగ్గర ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న సురావారి పల్లికి చెందిన మంగయ్య మృతి చెందాడు. అదే సమయంలో ప్రమాదం జరిగిందని గమనించి కారి దిగి సహాయం చేద్దామని వచ్చిన భార్యాభర్తలు స్వప్న, కిరణ్ కుమార్ ల పైకి అతి వేగంగా ఏర్పేడు ఏస్ఐ పోలీసు వాహనం దూసుకెళ్లింది. పోలీస్ వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు హస్పత్రిలో చికిత్స పోందుతూ భార్య మృతి చెందగా.. భర్త కిరణ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read Also: Pappu Yadav : ఎంపీ పప్పు యాదవ్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు..రూ.కోటి మోసం చేశాడని ఆరోపణలు

అలాగే, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం పెద బ్రహ్మ దేవంలో చక్రరావు అనే వ్యక్తి రోడ్డు పక్కన పాన్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. రోజులాగే, తన నాలుగేళ్ల మనవడిని షాప్ కి చక్రరావు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే షాప్ దగ్గర ఆడుకుంటున్న సమయంలో బైక్ ని తప్పించబోయిన కారు ఒక్కసారిగా బాలుడి మీదకు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.