అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికలకు సమయం దగ్గరికి వస్తుండడంతో ఈలోపే అధికార యంత్రాంగానికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్, ఐఏఎస్ లతో పాటు అన్ని శాఖల్లోనూ పదోన్నతులు, బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొందరు అధికారులకు పదోన్నతులు కల్పించింది. తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లు పదోన్నతలు పొందారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు ఐపీఎస్ లకు DIGP లుగా పదోన్నతి కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అంబరి కిషోర్ జా, రెమా రాజేశ్వరి, ఎల్ ఎస్ చౌహన్, నారాయణ నాయక్, పరిమళ, రంగారెడ్డి లకు పదోన్నతులు లభించాయి.
Also Read : Uttar Prasdesh: ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు దొరికినందుకు కూతురును హత్య చేసిన తల్లిదండ్రులు
ఇదిలా ఉంటే.. ఇటీవల రాష్ట్రంలోని 10 మంది అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ హోదా ప్రకటించింది. ఈ మేరకు జల్ద అరుణ శ్రీ, నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్, కోరం అశోక్ రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్ ఐఏఎస్ హోదా కల్పిస్తూ గత మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరితోపాటు మరో ఏడుగురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే నేడు మరో ఆరుగురు ఐపీఎస్ లకు DIGP లుగా ప్రమోషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్.
