Site icon NTV Telugu

The Greatest Of All Time: విజయ్‌ ‘ది గోట్‌’లో మాజీ క్రికెటర్‌ మాత్రమే కాదు.. స్టార్ హీరో కూడా!

The Goat

The Goat

Sivakarthikeyan in Vijay’s The GOAT Movie: కోలీవుడ్‌ స్టార్‌ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజాగా నటించిన సినిమా ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది గోట్‌ విడుదలకు కొన్ని గంటల ముందు చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ను రివీల్‌ చేసింది. ఇందులో భారత మాజీ క్రికెటర్ ఎస్ బద్రినాథ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో మాజీ క్రికెటర్‌ మాత్రమే కాదు స్టార్ హీరో కూడా ఉన్నాడు.

ది గోట్‌ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్ అతిథి పాత్రలో మెరిశారు. స్టేడియంలో వచ్చే సీన్‌లో ఆయన కనిపించారు. ఎస్‌కే కనిపించగానే ప్రేక్షకులు థియేటర్లో సందడి చేశారు. ఇందులో కోలీవుడ్‌ దివంగత నటుడు విజయ్‌కాంత్‌ను ఏఐ టెక్నాలజీతో రీ క్రియేట్‌ చేశారు. క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌లో కొన్ని సెకండ్ల పాటు ఆయన తెరపై కనిపించారు. అంతేకాదు ఏఐ సాయంతో దివంగత గాయని భవతారణి వాయిస్‌తో పాటను క్రియేట్‌ చేశారు.

Also Read: Double iSmart OTT: ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’!

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ది గోట్‌ చిత్రంలో పంజాబీ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. ప్రశాంత్‌, ప్రభుదేవా, వైభవ్‌, లైలా, స్నేహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజ‌య్ డ్యూయ‌ల్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు యువన్‌ శంకర్‌రాజా స్వరాలు అందించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేసింది.

Exit mobile version