Site icon NTV Telugu

Ayalaan Telugu OTT Release: థియేటర్ కన్న ముందే ఓటీటీకి రాబోతున్న తమిళ స్టార్ హీరో..

Ayalaan

Ayalaan

Ayalaan Telugu OTT Release: శివకార్తికేయన్ హీరోగా ఆర్.రవికుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘అయలాన్’. సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందిన ఈ మూవీ 2024 జనవరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక ఎలియన్ కథ ఆధారంగా, విజువల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ అంశాలతో ‘అయలాన్’ ను రూపొంచారు. అయితే ఈ చిత్రం 2024 జనవరిలో రిలీజ్ అయినా ఇప్పటి వరకు కూడా తెలుగులోకి రాలేదు. ఎట్టకేలకు తెలుగు ఆడియన్స్‌ ముందుకు ఈ చిత్రం రాబోతుంది.

READ ALSO: Chicken Price: నాన్‌వెజ్‌ లవర్స్‌కు షాక్‌..

తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను అఫిషియల్‌గా ఫిక్స్ అనౌన్స్ చేసింది. జనవరి 7 నుంచి ఈ సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌కు కానుంది. ఈ చిత్రాన్ని కామెడీ, ఎమోషన్‌తో పాటు అడ్వెంచర్ టచ్ ఇస్తూ రూపొందించారు. హీరో శివకార్తికేయన్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ‘అయలాన్’ సినిమా విషయానికొస్తే.. ఓ మిషన్‌లో భాగంగా ఏలియన్ భూమి మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో(శివ కార్తికేయన్‍)ని కలుస్తుంది. కొన్నాళ్లకు ఏలియన్-హీరోకు స్నేహం ఏ‍ర్పడుతుంది. ఆ ఏలియన్‌కి టాటూ అని పేరు. అసలు టాటూ, భూమి మీదకు రావడానికి కారణమేంటి? అనేది స్టోరీ. ఏలియన్‌ పాత్రకు హీరో సిద్ధార్థ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా, ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’. ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో శివకార్తికేయన్ థియేటర్ కంటే ముందే తెలుగు ప్రేక్షకులను ఓటీటీ ద్వారా పలకరించనున్నారు.

READ ALSO: Trent Share: 2 నిమిషాల్లో రూ.162 కోట్లు పోగొట్టుకున్న బిలియనీర్.. మార్కెట్‌ను ముంచిన ట్రెంట్ షేర్లు

Exit mobile version