Site icon NTV Telugu

Sivakarthikeyan : ఆర్మీ నుంచి అరుదైన అవార్డు అందుకున్న హీరో శివ కార్తికేయన్

New Project (64)

New Project (64)

Sivakarthikeyan : శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది అమరన్. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మించారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అమరన్ అన్ని భాషల్లో మంచి టాక్ తెచ్చుకుంది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100కోట్ల మార్కును దాటేసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలో ఫ్యామిలీ ఆడియెన్స్ తో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి. దీపావళికి రిలీజ్ అయిన సినిమాలలో టాప్ లో నిలిచింది. కేరళ, కన్నడ లోను శివ కార్తికేయన్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తెచుకుంది అమరన్. శివకార్తీకేయన్ నటనకు సాయి పల్లవి అభినయానికి ప్రేక్షకులు కంటతడి పెట్టారు. శివకార్తికేయన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా అమరన్ నిలిచింది. ఇప్పట్లో మరే సినిమాలు లేకపోవడంతో అమరన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. అమరన్‌ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు మూడు వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also:India-Pakistan: ఆ అంశంలో భారత్‌ కంటే.. పాకిస్థానే నంబర్ వన్..

అమరన్‌ సినిమాలో మేజనర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత కథను చూపించారు. అమరన్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర పోషించి ఇండియన్‌ ఆర్మీ గౌరవాన్ని మరింతగా పెంచిన హీరో శివ కార్తికేయన్‌కి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ తరపున శివ కార్తికేయన్‌కి అవార్డును అందించారు ఇండియన్‌ ఆర్మీ గౌరవం దక్కించుకున్న ఏకైక నటుడిగా శివ కార్తికేయన్‌ నిలిచారు. సినిమాతో ఆయనకు కోలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ దక్కింది. జీవి ప్రకాష్ సంగీతం అందించిన అమరన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటి వరకు దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అమరన్‌ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్లు కచ్చితంగా సంచలనంగా చెప్పుకోవచ్చు. మీడియం రేంజ్‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఈ స్థాయి వసూళ్లను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో శివ కార్తికేయన్‌ నటించగా, ఆయన భార్య ఇందు రెబ్బెక్సా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి జీవించిందని చెప్పాలి. సినిమాలో సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధించడంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివ కార్తికేయన్‌ ఇకపై వరుసగా పాన్‌ ఇండియా మూవీస్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Read Also:India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్‌పై భారత్ కీలక వ్యాఖ్యలు..

Exit mobile version