సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా.. కొన్ని రోజులుగా ఆయన ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో.. ఆగస్టు 19న ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. సీతారాం ఏచూరి మృతితో.. అటు కమ్యూనిస్ట్ వర్గాల్లో, దేశ రాజకీయాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.
Stock market: మరోసారి రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
ఏచూరి స్వస్థలం కాకినాడ, పూర్తిపేరు ఏచూరి సీతారామారావు.ఆయన.. 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. కాగా.. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. సీతారాం ఏచూరి.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు.