NTV Telugu Site icon

Memorial Meet: సెప్టెంబర్‌ 21న హైదరాబాద్‌లో సీతారాం ఏచూరి సంస్మరణ సభ..

Sitaram Yechury

Sitaram Yechury

సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి.. ఈ నెల 12న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. వారి మరణం జాతీయ, అంతర్జాతీయ  కమ్యూనిస్టు ఉద్యమాలకు, ప్రత్యేకంగా తెలుగురాష్ట్రాలకు తీరని లోటు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ  ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 21న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  ‘సీతారాం ఏచూరి సంస్మరణ సభ’ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.

Read Also: Knife Attack: సముద్రం తీరంలో కత్తులతో దాడి.. తీవ్రగాయాలతో వ్యక్తి మృతి

ఈ సభలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పీసీసీ అధ్యక్షులు బి. మహేష్‌కుమార్‌ గౌడ్‌, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు ఇతర వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించనున్నట్లు తమ్మినేని తెలిపారు. ఈ సంస్మరణ సభను జయప్రదం చేయాలని ప్రజలకు, ప్రజాతంత్రవాదులకు, వామపక్ష మేధావులకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Read Also: CM Revanth: కేసీఆర్, కేటీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

Show comments