NTV Telugu Site icon

Andhra Pradesh: ఎన్నికల అనంతరం హింస.. సిట్‌ నివేదికలో కీలక అంశాలు..

Sit

Sit

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై నివేదిక సమర్పించింది సిట్. రెండు వాల్యూముల్లో సిట్ నివేదిక సమర్పించారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్. మొదటి వాల్యూమ్ 112 పేజీలు, రెండో వాల్యూమ్ 152 పేజీలతో నివేదిక తయారు చేశారు.. తాము గుర్తించిన అంశాలతో పాటు.. తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూములో తొమ్మది ఛాప్టర్లల్లో తమ అబ్జరవ్వేషన్లను ఉంచిన సిట్. రెండో ఛాప్టర్‌లో వివిధ కేసులకు సంబంధించిన తమ ఫైండింగులను ఎఫ్ఐఆర్‌ల వారీగా వివరించింది.

Read Also: France: పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎన్నికలకు పిలుపు

ఇక, సిట్ నివేదిక విషయానికి వస్తే.. పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుంచి విచారణ వరకూ పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదు. నిందితుల్ని ప్రశ్నించకపోవటంతో పాటు వారిపై సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్ లో ఆగంతకులుగా నమోదు చేయటం సరైంది కాదు. నిందితులు తెలిసి ఉన్నప్పటికీ వారిని అరెస్టు చేయలేదని సిట్‌ పేర్కొంది.. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంతవరకూ జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీల పర్యవేక్షించాలని సూచించింది. మరోవైపు.. పల్నాడులో 276, తిరుపతి 70. అనంతపురంలో 718 మందిని అరెస్ట్ చేశాం. పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతలో 527 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందన్న సిట్.. ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే.. వారిలో 1245 మందిని గుర్తించామని తెలిపింది.. చాలా మందిని గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారనే ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీరిని గుర్తించే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపింది.

Read Also: Ramcharan : బ్రేకింగ్: బాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్

మరోవైపు.. పట్టపగలే సంఘటనలు జరిగినా.. ప్రత్యక్ష సాక్షులను గుర్తించలేకపోయారని సిట్‌ పేర్కొంది.. ఈవీఎంల ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్ క్యాస్టింగ్ ఉన్నా.. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్ స్టేషన్లల్లో జరిగిన హింసాత్మక ఘటనను పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసే విషయంలో బీఎల్ఎలు.. వీఆర్వోలు చాలా ఆలస్యం చేయడం ఆశ్చర్యమనిపించిందని తన నివేదికలో రాసుకొచింది.. సరైన దర్యాప్తు చేయాలని ఇన్వేస్టిగేష్ అధికారులకు మెమో జారీ చేశాం. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేసేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తన నివేదికలో పేర్కొంది సిట్‌.