టీఎస్పీఎస్సీ పేపర్ లింక్‌పై స్టేటస్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో పలు నిమిషాలు సిట్ ప్రస్తావించింది. TSPSC దర్యాప్తు రిపోర్ట్ సబ్మిట్ చేసింది సిట్. అయితే.. 250 పేజీల రిపోర్ట్స్, ఎంక్లోజర్స్ ని కోర్టులో దాఖలు చేశారు పోలీసులు. 18 పేజీల సిట్ ఇన్విస్టిగేషన్ సమ్మరీ రిపోర్ట్‌ను సబ్మిట్ చేసింది సిట్. పేపర్ లీకేజీలో 40 లక్షల నగదు బదిలీ జరిగినట్టు సిట్ పేర్కొంది. పేపర్ పొందిన 15 మందిని అరెస్ట్ చేశామని, శంకర్ లక్ష్మి ని సాక్షిగా పరిగణించిన సిట్.. టీఎస్పీఎస్సీ లీకేజీలో ప్రధాన పాత్ర ప్రవీణ్ , రాజశేఖర్ లదే అని తెలిపింది.
Also Read : Bombay High Court: “వైవాహిక వివాదాలు” మనదేశంలో తీవ్రమైన కేసులు..
టీఎస్పీఎస్సీ మెంబర్ , చైర్మెన్ ని విచారించామని, సిట్ దర్యాప్తు పై నమ్మకం లేదనీ, సీబీఐ, సిట్టింగ్ జడ్జ్ తో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్లపై రిపోర్ట్ లో వివరణ ఇచ్చింది సిట్. గతంలో సిట్ ఎన్నో సెన్సేషనల్ కేసుల్ని విచారించామని, టీఎస్పీఎస్సీలో కూడా పటిష్ట దర్యాప్తు చేస్తున్నాం సిట్ తెలిపింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని రిపోర్ట్ లో పేర్కోన్న సిట్.. టీఎస్పీఎస్సీ లో కీలకంగా మారిన FSL రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపింది. దర్యాప్తులో భాగంగా వివాదస్పద కామెంట్స్ చేసిన రాజకీయ నాయకులకి నోటీసులిచ్చామని, కానీ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నారు. సాక్షుల, నిందితులు, మెంబర్ చైర్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆధారాల్ని కోర్టుకి సమర్పించింది సిట్.
Also Read : Ram Charan: చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ