NTV Telugu Site icon

AP Violence: చంద్రగిరిలో హింసాత్మక ఘటనలపై పోలీసులు అలెర్ట్

Chandragiri

Chandragiri

AP Violence: తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అత్యంత సమస్యాత్మక క్రేందాలను గుర్తించి కార్డెన్ సెర్చ్ చేస్తున్నారు. 3 సీఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఏ.రంగంపేటలో అనుమానాలున్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తన్నారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కౌంటింగ్‌ ముగిసినా కేంద్ర బృందాలు అందుబాటులో ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కాగా, మరోవైపు ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం తయారు చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్లర్లపై రెండు రోజుల పాటు విచారణ చేసిన సిట్ అధికారులు.. సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను అందించింది. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు కీలక అంశాలను పొందుపర్చారు. పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజు చెలరేగిన ఘర్షణల్లో మరణాలకు దారితీసే స్థాయిలో రెండు వర్గాలు రాళ్ల దాడికి పాల్పడినట్లు సిట్ టీమ్ పేర్కొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారని వెల్లడించింది.