Site icon NTV Telugu

AP Liquor Scam Case: సిట్ విచారణ.. సంచలన విషయాలు బయటపెట్టిన నారాయణస్వామి..!

Narayana Swamy

Narayana Swamy

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ స్కామ్‌ కేసు సంచలనంగా మారింది.. విచారణలో మరింత దూకుడు పెంచింది సిట్‌.. ఇప్పటికే కీలక వ్యక్తులు అరెస్ట్‌ కాగా.. మరిన్ని అరెస్ట్‌లు తప్పవనే ప్రచారం జరుగుతోంది.. అయితే, ఈ రోజు లిక్కర్ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్‌ అధికారులు.. అయితే, సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారట నారాయణస్వామి.. ఏపీ బేవరేజ్ సంబంధించిన అధికారులను నియమించడంలో నా పాత్ర ఏమీ లేదన్నారు.. నాకు లిక్కర్ కేసుకు సంబంధం లేదన్న ఆయన.. సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు.. నా మాట అక్కడ వినే వారు ఎవరంటూ చెప్పుకొచ్చారట నారాయణస్వామి.. నా మాటలను అక్కడ ఏ అధికారి వినలేదన్న ఆయన.. సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను ముందుపెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలారట.. నారాయణస్వామి నుంచి మరిన్ని కీలకమైన విషయాలు రాబట్టిందట సిట్.. మరోసారి విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. ఇక, నారాయణస్వామి ఇంటిలో విచారణ ముగించుకొని సిట్‌ టీమ్‌ బయల్దేరివెళ్లిపోయింది..

Read Also: Bigg Boss Agnipariksha Promo : ముఖానికి పేడ రాసుకున్న కంటెస్టెంట్.. ఇవేం పనులురా బాబు..

మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ సిట్‌ విచారణ ముగిసింది.. మరోసారి నారాయణ స్వామిని విచారించే అవకాశం‌ ఉండగా.. దానికి సంబంధించిన సిట్‌ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. దాదాపు ఆరు గంటల పాటు నారాయణ స్వామిని ప్రశ్నించింది సిట్.. పలు డాక్యుమెంట్లు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు.. సైబర్ నిపుణుల ద్వారా మెయిల్స్, మెసేజ్‌లను రిస్టోర్ చేశారు అధికారులు.. కేసిరెడ్డి సహా ఇతరుల ఇచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను నారాయణ స్వామి ముందు పెట్టి ప్రశ్నించింది సిట్… కాగా, వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖామంత్రిగా పని చేశారు నారాయణస్వామి.. వైసీపీ హయాంలో మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్‌లో ఆన్ లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడంపై విచారించిందట సిట్ బృందం.. డిజిటల్ చెల్లింపులు జరపకుండా మద్యం అమ్మకాల వెనుక ఎవరి ఒత్తిళ్లున్నాయనేదానిపై నారాయణస్వామిని ప్రశ్నించింది.. ఎక్సైజ్ పాలసీలో నాడు తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి పాత్ర ఏంటినేది విచారించింది.. అయితే, సిట్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వని నారాయణస్వామి.. పలు ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఉన్నారట.. మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారట మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..

Exit mobile version