Site icon NTV Telugu

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ

Phone Tapping Case

Phone Tapping Case

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దూకుడు పెంచింది సిట్‌. నాకేం తెలీదని ప్రభాకర్‌ రావు అంటుంటే… ప్రభాకర్‌ రావు చెప్పిందే తాను చేశానని ప్రణీత్‌ రావు అంటున్నాడు !! దీంతో… ఇద్దరినీ కలిపి వాచారించాలని భావిస్తున్నారు సిట్‌ అధికారులు. అలా ఐతే కానీ.. అసలు బండారం బయటపడేలా లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా ప్రభాకర్‌ రావు పేరు చెప్తుంటే… ప్రభాకర్‌ రావు మాత్రం తెలీదు… గుర్తులేదు.. మరిచిపోయా… అంటూ సిట్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడట !

ఫోన్‌ ట్యాపింగ్‌ కీలక నిందితుడు.. ప్రభాకర్‌ రావు అమెరికా నుంచి తిరిగిరావడంతో కేసు కొలక్కి వస్తుందని భావించారు. కానీ.. ప్రభాకర్‌ రావు కథ మొదటికి తెచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నిందితులంతా ప్రభాకర్‌ రావు పేరు చెప్పారు. తన డైరెక్షన్‌లోనే ట్యాపింగ్‌కి పాల్పడ్డామని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించారు. కానీ.. ప్రభాకర్‌ రావు మాత్రం తనకేం తెలీదని.. శాఖాపరమైన ఆదేశాలు మాత్రమే ఇచ్చానని చెప్తున్నాడు. అదీకాకుండా… ఉల్టా సిట్‌ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు. నాపై ఉన్నతాధికారులను కూడా ఈ కేసులో ఎందుకు చేర్చలేదని సిట్‌ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు.

దీంతో… సిట్‌ అధికారులు ఈసారి పక్కాగా ప్లాన్‌ చేశారు. రెండుసార్లు ప్రభాకర్‌ రావును విచారించిన సిట్‌… ఈసారి అనూహ్యంగా ప్రణీత్‌రావును మరోసారి విచారించింది. ప్రభాకర్‌ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడు అనే వివరాలపై మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. మరుసటి రోజే… అంటే ఈరోజు ప్రభాకర్‌ రావును మరోసారి విచారణకు పిలిచారు సిట్‌ అధికారులు. ప్రణీత్‌ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రభాకర్‌ రావు ముందుంచి విచారణ స్టార్ట్‌ చేశారు. మధ్యాహ్నం తర్వాత ప్రణీత్‌ రావును కూడా సిట్‌ కార్యాలయానికి పిలిచి… ఇద్దరినీ ఒకేసారి విచారించాలని భావిస్తున్నారు సిట్‌ అధికారులు.

రెండోసారి విచారణకు ప్రభాకర్‌ రావును పిలిచిన సిట్‌ అధికారులు… తన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, మ్యాక్‌ బుక్‌ లను తీసుకురావాలని సూచించారు సిట్‌ అధికారులు. దీంతో… తాను వాడిన రెండు మొబైల్‌ ఫోన్లను సిట్‌కు అందజేశారు ప్రభాకర్‌ రావు. ఆ మొబైల్స్‌ నుంచి ఏవైనా ఆధారాలు సేకరిస్తే.. వాటిని కూడా ముందుంచి ప్రభాకర్‌ రావును విచారించనుంది సిట్‌.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..!

Exit mobile version