Site icon NTV Telugu

Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు అరెస్టు!

Ap Liquor Scam

Ap Liquor Scam

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఈరోజు ఉదయం గోవిందప్పను అరెస్ట్‌ చేసి.. విజయవాడకు తీసుకొస్తున్నారు. భారతీ సిమెంట్స్‌లో గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో అయన ఏ33గా ఉన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉంది.

Also Read: Suresh Babu: సంజాయిషీపై సంతృప్తి చెందకపోతే.. సురేష్ బాబుపై అనర్హత వేటు?

ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ బాలాజీ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ఓఎస్డీ కృష్ణ మోహన్‌ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో గత ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ముగ్గురిని ఆదేశించారు. అయితే వీరు ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ.. విచారణకు డుమ్మా కొట్టారు. గోవిందప్ప మైసూరులో ఉన్నాడన్న పక్కా సమాచారంతో.. సిట్‌ అధికారులు అక్కడికి వెళ్లి ఈరోజు అరెస్ట్ చేశారు. గోవిందప్ప అరెస్టుతో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకి చేరింది.

Exit mobile version