NTV Telugu Site icon

Mohammed Siraj : సిరాజ్ తో బెట్టింగ్ డీల్..? నిందితుడు అరెస్ట్

Siraj

Siraj

ఐపీఎల్ లో మరోసారి ఫిక్సింగ్ కలకలం సంచలనం రేపుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్.. హైదరాబాద్ స్టార్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదుతో ఈ విషయం బయటకు వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్ కు ఫోపన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన విసయాలు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇదే విషయాన్ని సిరాజ్ గతవారం భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం( ఏసీయూ)తో తనకు వచ్చిన కాల్ గురించి సిరాజ్ వెల్లడించినట్లు పేర్కొంది.

Also Read : Physical Harassment: బాలుడిపై అత్యాచార యత్నం.. హతమార్చిన మైనర్

అయితే మహ్మద్ సిరాజ్ ను సంప్రదించింది బుకీ కాదని.. హైదరాబాద్ కు చెందిన ఓ డ్రైవర్ అని.. ఈ విషయంలో బీసీసీఐ వెంటనే చర్యలు చేపటినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ సిన్నిహిత వర్గాలు సిరాజ్ ను సంప్రదించింది.. బెట్టింగ్ లకు అలవాటు పడిన ఓ డ్రైవర్ అని వెల్లడించారు. బెట్టింగ్ తో అతడు చాలా మేర డబ్బు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో అతడు సిరాజ్ ను సంప్రదించి ఆర్సీబీ అంతర్గత విషయాలు అడిగాడు.. ఈ విషయాన్ని వెంటనే సిరాజ్ బీసీసీఐ ఏసీయూకి తెలిపాడు. వెంటనే దర్యాప్తు సంస్థలు సదరు వ్యక్తిని పట్టుకున్నాయి అని తెలుస్తోంది. కాగా గతంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీమాల్ ఫిక్సింగ్ ఉచ్చులో పడి కెరీర్ ను నాశనం చేసుకున్నారు. అయితే గతంలో కూడా ఫిక్సింగ్ కు పాల్పడిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు నిషేదం ఎదుర్కొన్నాయి. కాగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపే ఐపీఎల్ మ్యాచ్ ల మీద తాజా సీజన్ లో బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సిరాజ్ ఫిర్యాదుతో బెట్టింగ్ రాయుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read : Mukul Roy: నేను బీజేపీ వ్యక్తినే… దీదీకి షాక్ ఇచ్చిన టిఎంసి నేత

Ipl Ad