NTV Telugu Site icon

Singireddy Niranjan Reddy : రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు.. పాలమూరు కష్టాలు తీరినట్లే

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

పాలమూరు కష్టాలు తీరినట్లేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉన్నదని, ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు.

Also Read : Miss Shetty Mr Polishetty : మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదలయ్యేది అప్పుడేనా..?

ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యామన్నారు. మిగిలిన పనులను వీలయినంత తొందరగా పూర్తి చేస్తాం.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల కాళ్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని, మడి, మడి తడుపుతానని శపథం చేశారన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

Also Read : Rahul Gandhi: పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగంపై రాహుల్‌గాంధీ ఫైర్

ఆ కల త్వరలోనే నెరవేరబోతున్నదని, 55, 60 ఏళ్ల జిల్లా ప్రజల వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతున్నదన్నారు. రైతులు, ప్రజలు వేయి కళ్లతో ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఇప్పటికే నార్లాపూర్ , ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈ అనుమతుల కోసం ఆగాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ వ్యూహానికి, ముందుచూపుకు ఇది ప్రతీక అని, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తీసుకువెళ్లడం అనే అనితర సాధ్యమైన పని కేసీఆర్‌కే సాధ్యమయింది.. మరెవరివల్లా ఇది సాధ్యం అయ్యేది కాదన్నారు.