Site icon NTV Telugu

Udit Narayan : ఉదిత్ కుటుంబంపై మాజీ భార్య క్రిమినల్ ఆరోపణలు

Ujith Narayan

Ujith Narayan

ఇండస్ట్రీలో విడాకులు.. వివాదాలు కామన్. కానీ అవి ఒక్కోసారి సెలబ్రెటిల పరువు పోయేలా కూడా చేస్తాయి. ప్రజంట్ ఇప్పుడు అలాంటి సరిస్థితిలోనే ఉన్నారు గాయకుడు ఉదిత్ నారాయణ్. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఉదిత్ నారాయణ్ పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా 90వ దశకంలో ఆయన పాడిన పాటలు ఒక ఊపు ఊపాయి. అయితే, వృత్తిపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తాజాగా ఆయన మొదటి భార్య రంజనా చేసిన ఫిర్యాదుతో పాత గొడవలు మళ్ళీ మొదటికి వచ్చాయి.

Also Read : Subbaraju : లేటు వయసులో పెళ్లి.. అసలు రహస్యం చెప్పిన .. సుబ్బరాజు

ఉదిత్ నారాయణ్ 2006లో మొదటిసారి పెళ్లి చేసుకున్నారనే విషయం అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది. మొదట ఆమె ఎవరో తనకు తెలియదని ఆయన వాదించినా, ఆధారాలు బయటపడటంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన తన మొదటి భార్యకు నెలకు రూ. 25,000 భరణం చెల్లిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించి షాకింగ్ ఆరోపణలు చేశారు. తన మాజీ భర్త ఉదిత్ నారాయణ్, ఆయన ప్రస్తుత భార్య దీపా నారాయణ్.. ఇతర కుటుంబ సభ్యులు కలిసి తనకు తెలియకుండానే తన గర్భాశయాన్ని తొలగించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, మూడు దశాబ్దాల క్రితం జరిగిన విషయమై ఇప్పుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఎంత వరకు నిలబడుతుందనేది అనుమానమేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version