NTV Telugu Site icon

Singer Suneetha: సింగర్ సునీతను చూసి నెటిజన్స్ ఫిదా.. హాట్ సింబల్ ఎమోజీలు షేర్

Sunitha

Sunitha

Singer Suneetha: సింగర్ సునీత చక్కని కట్టు బొట్టుతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది.. సింగర్ సునీత చీర కట్టు కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.. అయితే తాజాగా సునీత ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని వైట్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకొని.. మెడలో పూసల దండ వేసుకొని క్యూట్ గా ఉన్న ఓ వీడియో ను షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆరెంజ్ కలర్ చీరలో ఆమెను చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.. హాట్ సింబల్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ వీడియోను 1400 మంది లైక్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సింగర్ సునీత కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. 597కే ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఈ సింగర్ కి కూడా ఈమెకు ఉన్నంత క్రేజ్ లేదు అని అనడంలో సందేహమే లేదు.

Read Also: Kantara: కాంతారా ఎఫెక్ట్.. భూత కోల నర్తకులకు అలవెన్స్

ఇటీవల సునీత బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆయనతో పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉంది సునీత.. అయితే సింగర్ సునీతకు ఎవరైనా సరే వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోదు.. వెంటనే తనదైన శైలిలో రియాక్ట్ అవుతుంది.. వాళ్లకు బుద్ధి చెప్పే వరకు సునీత ఊరుకోదు. తన వైపు తప్పు లేకుండా ఎవరైనా సరే తనని కామెంట్ చేస్తే సునీత వెంటనే రియాక్ట్ అవుతారు సింగర్ సునీత ఎప్పటికీ ఎన్నో వందల పాటలను ఆలపించారు.. నిజం చెప్పాలంటే తెలుగులో చాలా మంది సింగర్స్‌కు లేని ఇమేజ్ సునీత సొంతం. పాటలు పాడినా పాడకపోయినా కూడా తన అందంతోనే ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది సునీత. ఈమెను చూస్తుంటే కచ్చితంగా హీరోయిన్లు కూడా కుళ్లుకుంటారేమో.. అంతందంగా సిగ్గు పడుతూ మాయ చేస్తుంది సునీత.

Show comments