Site icon NTV Telugu

Akhanda2 Thaandavam : అఖండ 2 కోసం పాట పాడిన ప్రముఖ ప్రవచన ప్రచారకర్త

Akhanda

Akhanda

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన  ‘సింహ‌’, ‘లెజెండ్’, ‘అఖండ‌’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ‌-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం ప్రవచన ప్రచారకర్త ఎల్ వి గంగాధర శాస్త్రి పాట పాడారు.

Also Read : Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

‘ ప్రముఖ ప్రవచన ప్రచారకర్త  ప్రసిద్ధ అగ్రేసర దర్శకులు శ్రీ బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటరత్న బాలకృష్ణ కథనాయకుడుగా రూపొందుతున్న ‘అఖండ 2’ విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపధ్యం లో ‘ఈ చిత్రం లోని ఒక కీలక సన్నివేశం కోసం భగవద్గీతలోని 2 శ్లోకాలు మీరే పాడాలి..’ ఆంటూ సంగీత దర్శకులు తమన్ హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని తన రికార్డింగ్ థియేటర్ ప్రసిద్ధ గాయకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా. ఎల్ వి గంగాధర శాస్త్రిని గురు భావనతో ఆహ్వానించారు. బోయపాటి శ్రీను గీతా శ్లోకాల సందర్భాన్ని, చిత్రo లోని కీలకమైన ఘట్టాలనూ కన్నులకు కట్టినట్టు గా వివరించారు. ఈ చిత్రం ఈ దేశానికి, సనాతన ధర్మానికి అంకితమని బోయపాటి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అఖండ’ చిత్రానికి అత్యంత బలమైన రీరికార్డింగ్ అందించిన తమన్ ను ఆయన ప్రత్యేకం గా అభినందించారు. ఇటీవల ఒక సందర్భం లో హీరో బాల కృష్ణ తనతో మాట్లాడుతూ సనాతన ధర్మం పవర్ ఏమిటో ఈ సినిమాలో చూపించామని అన్నారంటూ గంగాధర శాస్త్రి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భం గా శ్రీ బోయపాటి, శ్రీ థమన్ లను ‘ఈ చిత్రం ‘అఖండ’ విజయాన్ని సాధించుగాక..!’ అని ఆశీర్వదిస్తూ తులసిమాల, ‘భగవద్గీత’ బహూకరించారు. అని భగవద్గీత ఫౌండేషన్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసారు.

Exit mobile version