Site icon NTV Telugu

Singeetam Srinivasa Rao : టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో ఫిక్స్..

Singeetam Srinivasa Rao New Movie,

Singeetam Srinivasa Rao New Movie,

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’ వంటి కళాఖండాలను అందించిన ఈ జీనియస్, తన 61వ చిత్రాన్ని (#SSR61) ప్రకటించారు. ఈ వయసులోనూ ఆయనకు ఉన్న సినిమా ప్యాషన్‌ను చూసి సినీ లోకం ఆశ్చర్యపోతోంది.

Also Read : #D55: ధనుష్ సరసన శ్రీలీల.. #D55 క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే, ‘కల్కి 2898 AD’ దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాకు ప్రొడక్షన్ బాధ్యతలతో పాటు క్రియేటివ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇది సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లోనే మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ లేదా టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

 

Exit mobile version