“జార్జ్ రెడ్డి” ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి ఇచ్చిన కథతో యదార్థ ఘటనల నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ఇక ఈ సినిమా టైటిల్ కు ‘ ది అండర్ గ్రౌండ్ లైవ్స్ ‘ అంటూ ట్యాగ్ లైన్ ను జత చేసారు. ఇక సినిమా ధూమ్ర వారాహి బ్యానర్ పై కొత్త దర్శకుడు వివేక్ ఇనుగుర్తి తెరకెక్కించబోతున్నాడు. సింగరేణిలో 1999 లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను చేయబోతున్నారు చిత్ర బృందం.
Also Read: Salar : టీవీలో ‘సలార్’.. చూసినొళ్ళకు బంపర్ గిఫ్ట్..
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అతి త్వరలోనే “సింగరేణి జంగ్ సైరెన్” సినిమా సెట్స్ మీదకు చేరనున్నాయి. ఇక సినిమా సంబంధించి నటీనటులు, ఇతరుల వివరాలను ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’ అయిన ‘మేడే’ రోజున అంటే మే 1న ప్రకటించనున్నారు. తెలంగాణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా మంచి ఆదరణ పొందుతుందని చిత్ర బృందం భావిస్తుంది. తెలంగాణ నేటివ్ సినిమాగా “సింగరేణి జంగ్ సైరెన్” సినిమాను చేయనున్నారు.
Also Read: Prabhas: ప్రభాస్ ఫుల్ బిజీ.. రెండేళ్లు ఆగాల్సిందే!
ఇక సినిమా టెక్నికల్ టీమ్ చూస్తే.. కాస్ట్యూమ్స్ ను ప్రసన్న దంతులూరి, అసొసియేట్ రైటర్ గా లాటి ఫ్లింకారీ, ఎడిటింగ్ గా హరీశ్ మధురెడ్డి, సినిమాటోగ్రఫీని రాకీ వనమాలి, స్టిల్స్ గా సేగు వికాస్, వీఎఫ్ఎక్స్ ను మధు అర్జ్, మ్యూజిక్ ను సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా లలన్ మహేంద్ర, టి. మురళి రఘువరన్, పీఆర్ఓ గా జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)లు, కథను జీవన్ రెడ్డి అందిస్తుండగా వివేక్ ఇనుగుర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
