NTV Telugu Site icon

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సింగరేణి అధికారులు.. రెండో రోజు పర్యటన

Singareni

Singareni

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫుర్నేస్ 3లో ముడి సరకు కోసం జరుగుతున్న బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి స్వాగతించి మద్దతు పలుకుతోంది.

అయితే, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పూర్తి సామర్ధ్యంతో నడపకుండా కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డిందని కార్మిక సంఘలు ఆవేదన చెందుతున్నాయి. విశాఖ స్టీల్‌లోని బ్లాస్‌ఫర్నస్‌ 3ను మూసివేసిందని.. విశాఖ స్టీల్‌లోని అనేక విభాగాలు అపిందని అన్నారు. దేశంలో అన్ని స్టీల్‌ప్లాంట్‌కు లాభాలు వచ్చిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సుమారు 3వేల కోట్లు నష్టాలు మూటకట్టిందని బాధ పడుతున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం సామర్ధ్యంతో నడపాలని స్టీల్‌ పోరాట కమిటీ ఒత్తిడి చేస్తోంది. ఫలితంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ముడిఖనిజం, మూలధనం సమకూర్చడానికి ఆసక్తి కలిగిన వారు కోసం యాజమాన్యం గత నెల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ తో తెలంగాణలోని సింగరేణి కాలరీస్ తమ ఆసక్తి వ్యక్త పరచడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్యటిస్తోంది.

Show comments