Singapore Airlines: ఎయిరిండియా సేవలు భవిష్యత్తులో ఇండియా మొత్తం విస్తరించనున్నాయి. దేశంలోని కీలకమైన ఎయిర్‌లైన్ సెగ్మెంట్లన్నింటిలోనూ తన ఉనికిని చాటుకోనుంది. ఎయిరిండియాలోకి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విలీనం అనంతరం ఇది వాస్తవ రూపం దాల్చనుంది. ఫలితంగా మల్టీ హబ్ స్ట్రాటజీ అమల్లోకి వస్తుంది. తద్వారా.. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ అతిపెద్ద విమానయాన రంగంలో తనదైన గత వైభవాన్ని ఘనంగా చాటుకోనుంది.
India’s Top 10 Richest Women: ఇండియాలోని టాప్-10 సంపన్న మహిళలు
ఎయిరిండియాలో విలీనం తర్వాత ఈ సంస్థలో పాతిక శాతానికి పైగా వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ సొంతం చేసుకోనుంది. టాటా సన్స్‌తో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒప్పందం మరియు విస్తారా ఎయిర్‌లైన్స్‌తో విలీనం వల్ల ఎయిరిండియాలోకి 267 మిలియన్ డాలర్ల ఫండ్ రానుంది. తమ సంస్థ విలీనం అనంతరం ఏర్పడనున్న ఉమ్మడి ఎయిరిండియా పరిమాణం విస్తారా కంపెనీతో పోల్చితే నాలుగైదు రెట్లు ఎక్కువ కానుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
భారతదేశంలో తమ సంస్థ ఉనికిని కూడా పెంచుతుందని తెలిపింది. తమ హబ్‌లకు ప్యాసింజర్ ట్రాఫిక్ పెరుగుతుందని, కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిరిండియా గ్రూప్ కార్యకలాపాలు పెరుగుతాయని సింగపూర్ ఎయిర్‌లైన్స్ వివరించింది.