Site icon NTV Telugu

Simran Bala: గణతంత్ర దినోత్సవ పరేడ్ లో CRPF బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిణి.. సిమ్రాన్ బాలా ఎవరు?

Simran Bala

Simran Bala

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాక పతాకావిష్కరణలతో మువ్వన్నెల జెండా ఆకాశంలో రెపరెపలాడింది. సోమవారం కర్తవ్య పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లోని పూర్తి పురుషుల బృందానికి నాయకత్వం వహించి CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు చెందిన 26 ఏళ్ల అధికారిణి జాతీయ వేడుకల సందర్భంగా దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళంలో పూర్తి పురుష యూనిట్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళగా నిలిచారు.

Also Read:T20 World Cup 2026: అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్‌.. ఇక అంతే సంగతులు, ఇషాన్‌కు ప్లేస్ ఫిక్స్!

గతంలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మహిళా CRPF అధికారులు వివిధ బృందాలకు నాయకత్వం వహించినప్పటికీ, పూర్తిగా పురుష బృందానికి మహిళా అధికారి నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి. బాలా 147 మంది సిబ్బందితో కూడిన బృందానికి నాయకత్వం వహించారు. ఫోర్స్ బ్యాండ్ వాయించిన ఐకానిక్ CRPF పాట ‘దేశ్ కే హమ్ హై రక్షక్’ పాటకు అనుగుణంగా కవాతు చేశారు.

సిమ్రాన్ బాలా ఎవరు?

సిమ్రాన్ బాలా భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ నుండి కేవలం 11 కి.మీ దూరంలో ఉన్న నౌషెరా గ్రామానికి చెందినవారు. ఈ ప్రాంతంలో తరచుగా సరిహద్దు కాల్పులు జరిగాయి. ఇది ఆమె ప్రారంభ అనుభవాలను రూపొందించింది. రాజౌరి జిల్లా నుండి కమిషన్డ్ ఆఫీసర్‌గా CRPFలో చేరిన మొదటి మహిళ కూడా ఆమె. గణతంత్ర దినోత్సవంలో బృందానికి నాయకత్వం వహించడం నాకు నిజంగా గౌరవంగా అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు CRPFకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని బాలా అన్నారు.

Also Read:Nizamabad: గంజాయి స్మగ్లర్ల అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం!

ముగ్గురు తోబుట్టువులలో చిన్నవారైన బాలా బలమైన సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది. ఆమె తాత, తండ్రి ఇద్దరూ భారత సైన్యంలో పనిచేశారు. జమ్మూలోని గాంధీనగర్‌లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుండి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీని పొందింది. ఏప్రిల్ 2025లో నియామకం పొందిన బాలా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తారియా బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఇది నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనే ప్రత్యేక విభాగం. ఆమె నిబద్ధత దళంలోని యువ నాయకులలో ప్రత్యేకంగా నిలిపాయి. దాదాపు 3.25 లక్షల మంది సిబ్బందితో, CRPF భారతదేశ ప్రాథమిక అంతర్గత భద్రతా దళంగా కొనసాగుతోంది. నక్సల్ వ్యతిరేక జోన్స్, జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, ఈశాన్యంలోని తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాలు వంటి కీలక రంగాల్లో పనిచేస్తోంది.

Exit mobile version