NTV Telugu Site icon

Sikandar : మురుగదాస్, సల్మాన్ ఖాన్ స్పెషల్ ట్రీట్ వాయిదా.. వచ్చేది అప్పుడే

New Project 2024 12 27t123421.488

New Project 2024 12 27t123421.488

Sikandar : బాలీవుడ్ స్టార్ మీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం “సికందర్”. మరి ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొనగా ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. 2025 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సికందర్ టీజర్ ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read Also:Steven Smith Century: టీమిండియా అంటేనే ఊపొస్తుంది.. స్టీవ్‌ స్మిత్‌ ప్రపంచ రికార్డు!

అయితే ఈ సమయంలో మేకర్స్ సాలిడ్ టీజర్ కట్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా లేటెస్ట్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మరి ఈరోజే ఆ టీజర్ కూడా రావాల్సి ఉంది కానీ మేకర్స్ దానిని వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీనితో ఈ టీజర్ ఈరోజు నుంచి వాయిదా వేసి రేపటికి మళ్లీ అదే సమయానికి విడుదల చేస్తామన్నారు. దీంతో ఈ టీజర్ రేపు అంటే డిసెంబర్ 28న ఉదయం 11 గంటల 7 నిమిషాలకే రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో మరొక్క రోజు వరకు సల్మాన్.. సికిందర్ ఎంట్రీ కోసం ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సల్మాన్ స్నేహితుడు సాజిద్ నదియాద్వాల నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈద్ కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Read Also:Congress: మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే నివాళులు

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటే సికందర్. సికందర్ టీజర్ కు UA 13+ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు ప్రకారం, సికందర్ సినిమా రన్‌టైమ్ 1.45 నిమిషాలని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ టీజర్ లో మాస్క్ అవతార్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. సల్లూ భాయ్ మాస్క్ లు ధరించిన మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి హైపర్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. సమాజంలో అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.