Site icon NTV Telugu

Sigachi Factory Blast: సిగాచి పరిశ్రమ పేలుడు.. ఆచూకీ లభించని 8 కార్మికులపై అధికారుల కీలక ప్రకటన..!

Sigachi Factory Blast

Sigachi Factory Blast

Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో, ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ల బాడీలు పేలుడు సమయంలో తీవ్రంగా కాలిపోయి బూడిదయ్యి ఉంటారని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీని కారణం ఇప్పటివరకు 100కి పైగా శాంపిల్స్‌ను సేకరించి డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించినా ఒకటికీ కూడా తగిన పోలిక లభించలేదు.

Read Also:Bandi Sanjay Kumar: నేను మీలాగే పేదరికం నుండి వచ్చిన వాడినే.. కేంద్రమంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఈ నేపథ్యంలో, బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను పరిశ్రమ వద్ద నుంచి ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మూడునెలల తర్వాత తిరిగి రావాలని సూశించారు. అప్పటివరకు రాష్ట్ర, కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని తమవారిని కోల్పోయిన ప్రజలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also:EBOO Therapy Treatment: డాక్టర్ ధీరజ్ ‘పెయిన్ రిలీఫ్ & వెల్‌నెస్ సెంటర్’లో EBOO థెరపీ ప్రారంభం

Exit mobile version