Side Effects Of Eggs: గుడ్డు పోషకాల గని. అందుకే రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు గుడ్డు తినడం వల్ల లభిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు మూడు గుడ్లు తినడం మంచిది. అయితే మూడు గుడ్లు తినేవాళ్లు కచ్ఛితంగా రోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్ లు ఉంటాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ బీ దీని నుంచి లభిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న గుడ్ల వల్ల కూడా కొంత మందికి అనారోగ్యసమస్యలు రావొచ్చట. ఆరోగ్యానికి మంచిదని గుడ్లను ఎక్కువ తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు.
Also Read: Punjab : డ్రోన్ కు హెరాయిన్ నింపిన కోక్ బాటిల్ స్వాధీనం చేసుకున్న సైనికులు..
గుడ్డులో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి మధుమేహం, ప్రోస్టేట్, పెద్దపేగు వాపు, కొలొరెక్టర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. ఈ కారణంగానే గుండె సమస్యలు ఉన్నవారు గుడ్డు జోలికి వెళ్లకుండా ఉండే మంచిది. కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు గుడ్డు తినకూడదు. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల కిడ్ని సంబంధిత సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఇక అధిక బరువు ఉండి సన్నబడాలని ప్రయత్నిస్తున్న వారు కూడా గుడ్డుకు దూరంగా ఉండటం మంచిది.ఒక వేళ తినాలనుకుంటే ఎగ్ వైట్ తినండి కానీ ఎల్లో మాత్రం తినకండి. ఎందుకంటే ఎల్లోలో ఎక్కువ కొవ్వు ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు గుడ్లు తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇక డయేరియా సమస్య ఉన్నవారు గుడ్డు తింటే ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అధికంగా చెడు కొలెస్ట్రాల్ ఉంటే రక్తప్రసరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు గుడ్డులు తింటే ఇంకా ఆ సమస్య ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే అలాంటి వారు కేవలం గుడ్డులో తెలుపు భాగాన్ని తింటే మంచిది.