డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్త నిజం అయ్యింది. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. భాస్కర్ రీంసెంట్ గా అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీసి మంచి విజయం అందుకున్నాడు.భాస్కర్ ఇప్పుడు డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ తో తన తరువాత సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను మొదలు పెట్టారు.స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చి ఈ సినిమాకు ఓపెనింగ్ చేశారు. లవ్ స్టోరీస్ అద్భుతంగా తెరకెక్కించే బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాని ఎస్వీసీసీ పతాకంపై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో అని ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
ఇటీవల డీజే టిల్లు తో మంచి విజయం సాధించాడు సిద్దూ జొన్నలగడ్డ.ఈ సినిమా సిద్దూకు మంచి బ్రేక్ ఇచ్చింది. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో వచ్చింది.ఈ సినిమాతో సిద్దు జొన్నల గడ్డకు యూత్ లో క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి ఒక పాట విడుదలయి ట్రేండింగ్ అవుతుంది. సిద్దూ ఈ సినిమాతో యూత్ లో మరింత క్రేజ్ సంపాదించాలని చూస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలాగే రీసెంట్ గా ప్రారంభం అయినా భాస్కర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియాల్సి ఉంది.
