Site icon NTV Telugu

Siddipet : సిద్దిపేట జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు

Transfers

Transfers

సిద్దిపేట జిల్లాలో పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. జగదేవ్ పూర్ తహసీల్దార్ గా పనిచేసిన సహదేవ్ రాయపోల్ కి బదిలీ కాగా.. ములుగు డిప్యూటీ తహసీల్దార్ రఘువీరా రెడ్డి జగదేవపూర్ కి బదిలీ అయ్యారు. అంతేకాకుండా.. రాయపోల్ తహసీల్దార్ (FAC) సందీప్ దుబ్బాక తహసీల్దార్ గా బదిలీ అయ్యారు. వీరితో పాటు.. జగదేవ్ పూర్ డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ ములుగు నయాబ్ తహసీల్దార్ గా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version