Site icon NTV Telugu

Miss You : మిస్ యూ అంటున్న హీరో సిద్ధార్థ్.. ఎవరిని మిస్ అవుతున్నాడో ?

New Project (54)

New Project (54)

Miss You : టాలీవుడ్‌లో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన లవర్ భాయ్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగులో చేసింది కొన్ని సినిమాలే చేసినా, ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్‌తో పాటు సింగింగ్‌ టాలెంట్ తోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వరుసగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాడు.

Read Also:BJP: ముస్లిం మత నాయకుడు నోమానీపై ఫిర్యాదు చేసిన బీజేపీ..

గ‌తేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. ‘ఇండియన్ 2’తో డిజాస్టర్ అందుకున్నాడు. తాజాగా సిద్దార్థ్ త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మిస్ యూ’. ఎన్ రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను ఇటవల హీరో శివకార్తికేయన్, హీరో మాధవన్ విడుదల చేశారు.

Read Also:Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధం..

జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 23న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. 7 మైల్స్ ప‌ర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మిస్తున్నారు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ త‌దిత‌రులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version