Site icon NTV Telugu

Siddharth: అంతా డైరెక్టర్ శంకర్‌ వల్లే..

Siddharth

Siddharth

Siddharth: హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ వేడుకలో హీరో సిద్ధార్థ్ స్జేజీపై మాట్లాడారు. స్టేజీపై ‘బాయ్స్’ చిత్రంలోని పాట పాడారు హీరో సిద్ధార్థ. తాను మొట్టమొదటి సారి హైదరాబాద్‌లో డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్‌’ సినిమా ఆడియో ఫంక్షన్ చేసుకున్నామని సిద్ధార్థ్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో యూత్‌ అనే వారుంటే ఈ సినిమా ఎక్కుద్దని ‘బాయ్స్‌’ సినిమాలో హీరో అవకాశం ఇచ్చారని.. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు భారతీయుడు అనే వారుంటే ఈ సినిమా ఎక్కుతుందనే ధైర్యంతో ‘భారతీయుడు-2’ చిత్రంలో హీరోగా చేశారని డైరెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దర్శకుడు శంకర్‌ వల్లే తాను రెండు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నానని సిద్ధార్థ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి కమల్‌హాసన్‌ ఫేవరేట్‌ యాక్టర్‌ అని చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టమన్నారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో మరిచిపోలేని సినిమా ‘భారతీయుడు’ అని సిద్ధార్థ్ చెప్పారు. అలాంటి చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’తో కమల్‌హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలిపారు.

 

Exit mobile version