లోక నాయకుడు కమల్ హాసన్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఇండియన్ 2.. భారతీయుడు సినిమాకి సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక గొప్ప సినిమా అవుతుందని కూడా తెలిపారు. శంకర్ వంటి ఓ గొప్ప దర్శకుడి దగ్గర 20 సంవత్సరాలు తర్వాత సినిమా చేయడం నిజంగా నా అదృష్టం గా అని భావిస్తున్నాన ని సిద్ధార్థ్ తెలిపారు. ఇక కమల్ హాసన్ నాకు ఎంతో ఇష్టమైన హీరో అని కూడా తెలిపారు.. కమల్ హాసన్ గారు తనకు ఇష్టమైన హీరో మాత్రమే కాకుండా ఆయన నా మానసిక గురువు అని కూడా తెలిపారు. దూరం నుంచి తాను కమల్ హాసన్ గారి ని చూస్తూ ఎన్నో విషయాలు అయితే నేర్చుకున్నానని నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడనని కూడా సిద్ధార్థ్ తెలిపారు.ఇలా నా గురువు గారి తో కలిసి నేను సినిమా చేయడం ఎంతో అదృష్టంగా అయితే భావిస్తున్నానని కమల్ హాసన్ గారితో కలిసి సినిమా చేయడమే నా కల అని ఈ సినిమాతో ఆ కల నెరవేరిందని కూడా సిద్ధార్థ్ తెలిపారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ మీరు ఈ సినిమా గురించి ఎంత ఊహించకున్నా మీ ఊహాలకు మించి ఇండియన్ 2 సినిమా ఉండబోతుందని సిద్ధార్థ్ చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇండియన్ 2 సినిమాను శంకర్ కొత్త తరహా ధోరణి లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.