Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఈ నెల 20న ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka CM: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నాలుగు రోజులుగా సాగిన రాజకీయ డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల తర్వాత బుధవారం అర్ధరాత్రి కర్ణాటక నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మే 20 న మధ్యాహ్నం 12.30 గంటలకు వీరిద్దరు బెంగళూరులో వీరిద్దరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశం జరగనుంది. బెంగళూరులోని ఇందిరా గాంధీ భవన్లో సీఎల్పీని ఇవాళ ఏర్పాటు చేస్తున్నట్టు డీకే శివకుమార్ అర్థరాత్రి ప్రకటన విడుదల చేశారు. సీఎల్పీ సమావేశానికి బెంగళూరు చేరుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కేంద్ర పరిశీలకులను కోరారు. సీఎం పేరు ప్రకటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో ఇవాళ కర్ణాటక సీఎంను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈరోజు లేదా రేపు తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని, 72 గంటల్లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా బుధవారం తెలిపారు.
ఇవాళ ఉదయం 9 గంటలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఢిల్లీలో తొలిసారి కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను ముఖాముఖికి పిలిచింది. ఢిల్లీలో నాలుగు రోజులుగా ఉన్నా కూడా ఆ ఇరువురు ఒక్కసారి కూడా కలవలేదు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఇద్దరు కలిసే ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Read Also: Gujarat: దారుణం.. గర్ల్‌ఫ్రెండ్‌పైనే అత్యాచారం.. పైశాచిక ప్రవర్తన
బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన అభ్యర్థుల సుదీర్ఘ భేటీ కొనసాగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం కోసం డీకే శివకుమార్‌ను కూడా సమావేశంలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య మధ్య ఉమ్మడి ఒప్పందం కుదిరిందని అంతకుముందు రోజు వార్తలు వచ్చాయి. బెంగళూరులో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కానీ సాయంత్రం నాటికి పార్టీ దీనిని ఖండించింది. సీఎం పేరును నిర్ణయించడానికి మరో 2-3 రోజుల సమయం పడుతుందని చెప్పబడింది. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రిపై ఏకాభిప్రాయం కుదిరిందని అర్థరాత్రి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ ఆధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!