NTV Telugu Site icon

Andhra Pradesh Crime: మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌..!

Andhra Pradesh Crime

Andhra Pradesh Crime

Andhra Pradesh Crime: రక్షించాల్సిన పోలీసులే.. రాక్షసుల్లా మారుతున్నారు.. అండగా ఉండాల్సిన వాళ్లే.. అదును చూసి కాటు వేసి.. ఆపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా వెలుగుచూసిన ఘటన కలకలం రేపుతోంది. బర్త్‌డే అంటూ ఇంటికి పిలిచి.. మత్తు మంది ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. ఆపై ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ.. ఓ యువతి బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు

బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి ఓ యువతి అద్దంకి పీఎస్‌కు వచ్చారు.. గతంలో అద్దంకి ఎస్‌ఐగా విధులు నిర్వహించిన సమందర్‌ వలీ అనే వ్యక్తి తనకు అన్యాయం చేశారంటూ ఫిర్యాదు చేశారు.. ఒక రోజు బర్త్‌డే అంటూ నన్ను తన ఇంటికి పిలిపించి, మత్తుమందు ఇచ్చి తనపై ఎస్‌ఐ అత్యాచారం చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌బెయిల్‌చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.. శారీరకంగా నన్ను వాడుకున్న ఎస్సైని వివాహం చేసుకోమని అడిగితే.. చంపుతానని బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఇక, యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు. కాగా, ఆపద సమయంలో అండగా ఉండాల్సినే పోలీసులే.. ఇలా యువతిని లొంగదీసుకుని.. ఆపై బెదిరింపులకు దిగడం ఎంతవరకు సరైందని మండిపడుతున్నారు.

కాగా, అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సమందర్‌ వలీ, అద్దంకిలో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలోనే తిమ్మన పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య, కుమార్తె మృతిచెందడంతో.. ఆయన పట్ల ఉదాసీనంగా వ్యవహరించారట ఉన్నతాధికారులు.. ఇక, సమందర్ వలి అవినీతి, మహిళల పట్ల ఆయన ప్రవర్తన మారకపోవడంతో విధుల నుంచి సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. తాజాగా సమీనా అనే యువతి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్టు సీఐ రమేష్ వెల్లడించారు.