Site icon NTV Telugu

SI Madhu: నన్ను చంపాలని చూశారు..

Drunken

Drunken

SI Madhu: డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడులు వరుసగా ఆందోళన కలిగిస్తున్నాయి. నిజామాబాద్ ఘటన మరువక ముందే.. యాచారం అంబేద్కర్‌ చౌరస్తాలో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తనిఖీలు చేస్తున్న ఎస్సై మధును ఒక కారు ఢీకొట్టి, ఆపై బానెట్‌పై ఉంచుకుని దాదాపు అర కిలోమీటరు దూరం వేగంగా దూసుకెళ్లింది.

Kollywood : ఫామ్ కోల్పోయిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నో అప్డేట్

ఈ భయానక అనుభవంపై ఎస్ఐ మధు ‘ఎన్ టీవీ’తో మాట్లాడుతూ.. కారు డ్రైవర్ ఉన్మాదాన్ని వివరించారు. నేను డ్రంకెన్ డ్రైవ్‌లో ఉన్న వారికి చలాన్లు రాస్తుండగా, ఒక కారు కానిస్టేబుల్‌ను తప్పించుకుని నేరుగా నా మీదకు దూసుకువచ్చిందన్నారు. దానిని తప్పించుకునే లోపే నేను కారు బానెట్‌పై పడిపోయాను. నన్ను చంపేసైనా సరే పారిపోవాలన్న ఉద్దేశంతో కారును ఆపకుండా 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ముందుకు పోనిచ్చారని ఆయన తెలిపారు.

Nizamabad: గంజాయి స్మగ్లర్ల అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం!

కిందకు దూకుదామంటే ఎడమవైపు కారు టైర్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది. కుడివైపు డివైడర్లు ఉన్నాయి. అందుకే బానెట్‌ను గట్టిగా పట్టుకుని ఆపమని కేకలు వేశానని ఆయన వివరించారు. అలాగే తాను బానెట్‌పై ఉండగానే ఆ కారు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ఉన్న మహిళ కాలు విరిగింది (ఫ్రాక్చర్) అని అన్నారు. సుమారు 500 మీటర్ల తర్వాత ఒక మలుపు వద్ద కారు వేగం తగ్గించడంతో చాకచక్యంగా పక్కకు దూకేశానని తెలిపారు. తమపై దాడులు జరిగినా వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version