NTV Telugu Site icon

Shubman Gill: యువరాజ్ సింగ్ చెప్పాడనే ఓకే చెప్పా.. అసలు విషయం చెప్పేసిన శుభ్‌మన్ గిల్!

Shubman Gill

Shubman Gill

Shubman Gill Said Yuvraj Singh told him to join the Gujarat Titans: టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్‌లలో గిల్ పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డుల్లో నిలిచాడు. వన్డేల్లో ఏకంగా డబుల్ సెంచరీ ఫీట్ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే, టీ20లలో మొదటి ఎంపికగా మారాడు. అయితే గిల్ ఈ స్థాయికి ఎదగడానికి కారణం గుజరాత్ టైటాన్స్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

శుభ్‌మన్ గిల్ ముందుగా ఐపీఎల్ టోర్నీలో ముందుగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే సమయంలో గిల్ పెద్దగా రాణించలేదు. కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడినా.. సరైన గుర్తింపు రాలేదు. కోల్‌కతాలో ఉన్నపుడే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా పరుగులు చేయలేదు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలో చేరాక చెలరేగి ఆడాడు. గుజరాత్ ఆడిన తొలి సీజన్‌లోనే ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్‌ 2023లో టాప్ స్కోరర్‌గా రికార్డు సృష్టించాడు.

Also Read: Asia Cup 2023: ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌-పాకిస్తాన్.. జులై 23న మ్యాచ్?

గుజరాత్ టైటాన్స్ జట్టులో బాగా ఆడడంతో శుభ్‌మన్ గిల్ భారత జట్టులోని మూడు ఫార్మాట్‌లలో స్థానం దక్కించుకున్నాడు. అయితే గుజరాత్ జట్టులో ఆడే అవకాశం ఎలా వచ్చిందో గిల్ తాజాగా వెల్లడించాడు. గుజరాత్ ఫ్రాంచైజీ తనను తీసుకోవాలనుకుంటున్నట్లు ముందుగా తనకు మాజీ టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ చెప్పాడని గిల్ తెలిపాడు. ‘గుజరాత్ ఫ్రాంచైజీ నిన్ను తీసుకోవాలనుకుంటుంది. అక్కడ చాలా మంచి సెటప్ ఉంది. నువ్వు చాలా నేర్చుకుంటావు’ అని యువరాజ్ ముందుగా నాకు చెప్పాడు.

‘యువరాజ్ సింగ్ చెప్పాడని నేను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి ఆడడానికి ఓకే చెప్పా. ఇందుకు కారణం లేకపోలేదు. యువీ ఏమైనా చెప్తే.. దానికి చాలా వాల్యూ ఉంటుందని నాకు తెలుసు’ అని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. గిల్ ఇప్పటివరకు భారత్ తరఫున 17 టెస్టులు, 24 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. మరోవైపు 91 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.

Also Read: Fisker Ocean EV Launch: ఒక్కసారి చార్జ్ చేస్తే 707 కిమీ ప్రయాణం.. సోలార్ ప్యానెల్ రూఫ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ కారు!