Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధర్మశాలలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గిల్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి, అంతకుముందు 72 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందుకున్న శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టాడు.
భారత్ తరఫున అత్యంత వేగంగా 3000 వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (62 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో నిలవగా, శిఖర్ ధావన్ (72 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ (75 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత లోకేష్ రాహుల్ 78 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో, నవ్‌జోత్ సింగ్ సిద్ధూ 79 ఇన్నింగ్స్‌లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
Also Read
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
- Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 3000 వన్డే పరుగులు చేసిన ప్రపంచ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. గిల్ తన 62 ఇన్నింగ్స్‌ల ప్రదర్శనతో వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్‌ను అధిగమించాడు. షాయ్ హోప్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్ ముగ్గురూ చెరో 67 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని దాటి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 68 ఇన్నింగ్స్‌లతో ఈ అంతర్జాతీయ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఇదే మ్యాచ్‌లో మరికొన్ని విశేషాలు చూస్తే.. రోహిత్ శర్మ వన్డేల్లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించగా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత జట్టు రెండో వికెట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా 12 పరుగులకు అవుట్ అయ్యాడు. మొత్తం 3 వికేట్లు కోల్పోయిన భారత్.. ఇంకా 13 బాల్స్ మిగిలి ఉండగానే అప్గానిస్థాన్ పై విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో గిల్ 66 బాల్స్ లో 84 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 19 బాల్స్ లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
తాజావార్తలు
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
-
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
-
Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!