Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..

Gill

Gill

ధర్మశాలలో అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గిల్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి, అంతకుముందు 72 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందుకున్న శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టాడు.

భారత్ తరఫున అత్యంత వేగంగా 3000 వన్డే పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (62 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో నిలవగా, శిఖర్ ధావన్ (72 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ (75 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత లోకేష్ రాహుల్ 78 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో, నవ్‌జోత్ సింగ్ సిద్ధూ 79 ఇన్నింగ్స్‌లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

×
×
Ad

అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 3000 వన్డే పరుగులు చేసిన ప్రపంచ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా కేవలం 57 ఇన్నింగ్స్‌లతో మొదటి స్థానంలో ఉన్నాడు. గిల్ తన 62 ఇన్నింగ్స్‌ల ప్రదర్శనతో వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్‌ను అధిగమించాడు. షాయ్ హోప్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్ ముగ్గురూ చెరో 67 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని దాటి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 68 ఇన్నింగ్స్‌లతో ఈ అంతర్జాతీయ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇదే మ్యాచ్‌లో మరికొన్ని విశేషాలు చూస్తే.. రోహిత్ శర్మ వన్డేల్లో ఓపెనర్‌గా 16,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించగా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత జట్టు రెండో వికెట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా 12 పరుగులకు అవుట్ అయ్యాడు. మొత్తం 3 వికేట్లు కోల్పోయిన భారత్.. ఇంకా 13 బాల్స్ మిగిలి ఉండగానే అప్గానిస్థాన్ పై విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో గిల్ 66 బాల్స్ లో 84 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 19 బాల్స్ లో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.