Site icon NTV Telugu

IND vs SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మూడో టీ20 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

Shubman Gill

Shubman Gill

Shubman Gill Likely To Miss IND vs SL 3rd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ మీద భారత్‌ కన్నేసింది. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో టీ20కి దూరం కానున్నట్లు తెలుస్తోంది. మెడ కండరాలు పట్టేయడంతో రెండో మ్యాచ్ ఆడని గిల్.. ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.

Also Read: Cobra Viral Video: నాగదేవత విగ్రహంపై నాగుపాము.. అంతా ‘శివయ్య’ మహిమ!

మెడ కండరాలు పట్టేయడంతో శుభ్‌మన్ గిల్ రెండో టీ20కి దూరంగా ఉన్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌ గెలవడంతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. తొలి టీ20లో గిల్ 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆగస్టు 2 నుంచి శ్రీలంక, భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌కు కూడా గిల్ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో కొలంబో వేదికగా వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడనున్నారు. ఇప్పటికే ఇద్దరు శ్రీలంకకు చేరుకున్నారు.

Exit mobile version