Shubman Gill Breaks Sunil Gavaskar’s 47 Years Record: టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత్ కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 737 పరుగులు చేశాడు. దాంతో 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలైంది. 1978/79 సిరీస్‌లో వెస్టిండీస్‌పై సన్నీ 732 పరుగులు చేశాడు. ఇప్పుడు గవాస్కర్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత కెప్టెన్‌గా కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2016/17 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై 655 రన్స్ బాదాడు. ఈ జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో కూడా ఉన్నాడు. శ్రీలంకపై 2017/18లో 610 రన్స్ చేసిన విరాట్.. 2018లో ఇంగ్లండ్‌పై 593 బాదాడు. అయితే మొత్తంగా ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ పేరుపై ఉంది. 1936లో 810 రన్స్ చేశాడు. గ్రాహం గూచ్ 1990లో 752 రన్స్ బాదాడు. ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌మాన్ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉంది.
ఓవల్ టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దాంతో అంపైర్లు కాస్త ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. మొదటి రోజు లంచ్ సమయానికి భారత్ 23 ఓవర్లకు రెండు వికెట్స్ కోల్పోయి 72 రన్స్ చేసింది. క్రీజులో ఉన్న శుభ్‌మన్ గిల్ (15), సాయి సుదర్శన్ (25) ఉన్నారు. కేఎల్ రాహుల్ (14), యశస్వి జైస్వాల్ (2) అవుట్ అయ్యారు.
Also Read: AP Aqua Farming: ఆక్వా ఎగుమతులపై ట్రంప్ ఎఫెక్ట్.. రైతులపై మోయలేనంత పన్ను భారం!
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ల లిస్ట్:
# 737 – శుభ్‌మన్ గిల్ (ఇంగ్లండ్‌పై ) 2025
# 732 – సునీల్ గవాస్కర్ (వెస్టిండీస్‌పై) 1978/79
# 655 – విరాట్ కోహ్లీ (ఇంగ్లండ్‌పై ) 2016/17
# 610 – విరాట్ కోహ్లీ (శ్రీలంకపై) 2017/18
# 593 – విరాట్ కోహ్లీ (ఇంగ్లండ్‌పై ) 2018
