Site icon NTV Telugu

Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!

Shubanshu Shukla

Shubanshu Shukla

Shubanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు తమ మిషన్ పూర్తి చేసుకుని భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ సమయంలో శుభాంశు శుక్లా దాదాపు 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ సమయంలో ఆయన అనేక ప్రయోగాలు కూడా చేశారు. దాదాపు 23 గంటల ప్రయాణం తర్వాత, ఆయన డ్రాగన్ అంతరిక్ష నౌక కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ అయ్యింది. శుంభాషు శుక్లా తన నలుగురు వ్యోమగాములతో కలిసి జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్‌లో ISSకి బయలుదేరారు. భూమి నుండి 28 గంటల ప్రయాణం తర్వాత వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఇక్కడ 18 రోజులు గడిపారు.

Read also:Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్‌మీ C71 లాంచ్..!

ఇది నాసా, స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన మిషన్. ఈ అంతరిక్ష యాత్రలో 4 దేశాల నుండి నలుగురు వ్యోమగాములు పాల్గొన్నారు. జూలై 14న సాయంత్రం 4:45 గంటలకు శుభాంశు శుక్లాతో పాటు అందరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి బయలుదేరారు. ఈ వ్యోమగాములందరూ జూలై 15న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా తీరంలో స్ప్లాష్‌ డౌన్ జరిగింది. దీని తర్వాత వ్యోమగాములను సముద్రం నుండి బయటకు తీసుకవెళ్లింది యూఎస్‌ నేవీ.

Read also:Minister Satya Kumar Yadav: వైసీపీపై మంత్రి సత్యకుమార్‌ ఫైర్.. అబద్ధాలను ప్రచారం చేయడంలో ఆరితేరారు..!

వ్యోమగాములకు భద్రతా తనిఖీలు జరిపిన తర్వాత నాసా కేంద్రానికి తరలింపు చేపట్టనన్నారు. అక్కడ ఏడు రోజుల పాటు క్వారంటైన్ చేపట్టనున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన తర్వాత భూమికి తిరిగి వచ్చారు. ‘ఆక్సియం-4’ మిషన్ కింద, శుభాంశు శుక్లాతో పాటు అతని ముగ్గురు సహచర వ్యోమగాములు కూడా భూమికి తిరిగి వచ్చారు. 1984లో రాకేష్ శర్మ ప్రయాణం తర్వాత.. అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా చరిత్రలోకి ఎక్కారు.

Exit mobile version